Saturday 1 June 2013





The mind is everything. What you think you become.
We can learn somany things from the nature one of this...
సీతాకోకచిలుక జన్మ కథనాన్ని గమనిస్తే... స్వసహాయం ఎంత శ్రేయమో అర్థమౌతుంది. తన జీవిత పరిణామ దశలో భిన్న రూపాలుగా రూపాంతరం చెందుతూ.. అవిశ్రాంత పరిశ్రమ చేసి.. సీతాకోకచిలుకగా ప్రకృతిలోకి వస్తుంది. ఒక బాలుడు ఆడుకుంటూ.. అలాంటి ఒక సీతాకోకచిలుక తన జీవిత పరిణామ దశలో.. ఎంతో ప్రయాసపడటం గమనించాడు. అది ఎంత కష్టపడినా, బయటకు రాలేకపోతోందని జాలిపడి.. తన చేత్తో దాని రెక్కలను పట్టుకొని.. దాన్ని నెమ్మదిగా లాగి బయటికి తీసి గాలిలోకి ఎగురవేశాడు. దాన్ని బయటకు లాగి, దాని కష్టాన్ని తొలగించాను కదా! ఆ సీతాకోకచిలుక ఆనందంగా ఎగిరిపోతుందని అనుకున్నాడు ఆ బాలుడు. అయితే, అతను ఊహించినట్లు జరగలేదు. ఆ సీతాకోకచిలుక ఎగరలేక నేలమీద పడిపోయింది. పరుగున దాని దగ్గరకు వెళ్లి, తదేకంగా చూశాడు. ఆ సీతాకోకచిలుక తన రెక్కలను వేగంగా కదిలించ లేకపోతోంది. ఏం జరిగిందో బాలుడికి అర్థం కాలేదు. అంతా గమనిస్తున్న బాలుడి తండ్రి.. బాలుడి దగ్గరకు వచ్చాడు. ‘‘తన జీవిత పరిణామ దశలో.. గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారి.. తనంతట తాను బయటకు వచ్చే ప్రయత్నంలో.. దాని రెక్కలను వేగంగా ఆడిస్తూ శ్రమిస్తుంది. జిగురుతో కూడిన దాని బరువైన రెక్కలు.. వేగంగా ఆడించడం వల్ల ఆరి పోయి, తేలికవుతాయి. తేలికైన రెక్కలతో కూడిన సీతాకోకచిలుక బయటకు వచ్చి హాయిగా, తనంతట తానుగా ఎగరగలుగుతుంది. సీతాకోకచిలుకే కాదు.. మనమైనా, ఎవరైనా అంతే.. ఎంత పరిశ్రమ చేస్తే అంత ఎత్తుకు ఎగరగలుగుతాం.. ఎదగగలుగుతాం’’ అంటూ.. ప్రకృతి ధర్మాన్ని వివరించాడు తండ్రి!